Stock Market Rally-స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ | మార్కెట్‌లో జర జాగ్రత్త

Written by hari

Published on:

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1,053 పాయింట్లు దిగజారి 70,370 వద్దకు చేరింది.

సెన్సెక్స్ 30 సూచీలో సనాఫార్మా, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్ యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎఎఫ్సీ బ్యాంక్, బజాన్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జేఎస్ఈబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాలర్లకు చేరింది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ శనివారం రూ.545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIls)’ సైతం రూ.719.31 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు.

న్యూఢిల్లీ: Stock Market Rally-స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీపై హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిఫ్టీ 20 శాతం అధిక విలువతో ట్రేడవుతున్నందున జాగ్రత్తగా ఉండాలని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ త్రైమాసిక నివేదికలో హెచ్చరించింది. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎపుడైనా మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్స రం స్టాక్‌మార్కెట్‌లో పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపించడంలేదంది. ఒకవేళ కొన్ని షేర్లలో కొద్దిపాటి లాభాలున్నా, ఎక్కువ కంపెనీల షేర్లలో మాత్రం నష్టాలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది మార్కెట్‌ లాభాలు ఫండమెంటల్స్‌, సెంటిమెంట్‌ మధ్య జరిగే పోరాటంపై ఆధారపడి ఉంటాయని తెలిపింది.

Also read: Zee Entertainment share price down 30 Percentage after Sony? (lsrupdates.com)

Brisk Technovision IPO Details Date, Price, Allotment -2024 (lsrallinonenews.com)

Megatherm Induction IPO News-2024 గ్రేమార్కెట్లో దూసుకుపోత (lsrallinonenews.com)

HDFC Bank share price extends decline; plunges over 10% (lsrallinonenews.com)

Leave a Comment