ప్రొటీన్‌ అతిగా తీసుకుంటున్నారా..? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త..!

Written by hari

Published on:

Side Effects Of A High-Protein Diet: ప్రొటీన్‌ రిచ్‌ డైట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో, కొంతమంది హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటుంటారా. దీని కారణంగా ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

​Side Effects Of A High-Protein Diet: ఆరోగ్యంగా ఉండటానికి ప్రొటీన్‌ అత్యవసరం. కణజాలాల తయారీ, మరమ్మతు, దృఢత్వంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థనూ మెరుగుపరుస్తుంది. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల రసాయన చర్యలకు తోడ్పడుతుంది. ప్రొటీన్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో కొంతమంది.. వారి హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటూ ఉంటారు. ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకుంటే.. కార్బ్స్‌ను తగ్గిస్తుందని, శరీరం పోషకాలు, ఫైబర్‌ను గ్రహించుకోలేదని, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకుంటే.. దీర్షకాలంలో శరీరంపై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ప్రొటీన్‌ అతిగా తీసుకంటే.. ఎదురయ్యే సమస్యలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.​

Leave a Comment