జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

Written by hari

Published on:

గత ఏడాది డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో గడించిన రూ.1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే…

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం.ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

ABN , Publish Date – Jan 02 , 2024 | 04:41 AM

గత ఏడాది డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో గడించిన రూ.1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే…

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు

గతనెలలో 10ు వృద్ధి నమోదు

Advertisement: 0:25Close Player

ఏపీ వసూళ్లు రూ.3,545 కోట్లు..

తెలంగాణలో రూ.4,753 కోట్లు

న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబరులో గడించిన రూ.1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గతనెలకు జీఎ్‌సటీ వసూళ్లు రూ.1,64,882 కోట్లుగా ఉన్నాయి. అందులో సెంట్రల్‌ జీఎ్‌సటీ రూ.30,443 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ రూ.37,935 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ రూ.84,225 కోట్లుగా ఉంది. సెస్సు రూపంలో మరో రూ.12,249 కోట్లు వసూలయ్యాయి. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఐజీఎ్‌సటీ ఆదాయంలో రూ.40,057 కోట్లను సీజీఎ్‌సటీలో, రూ.33,652 కోట్లు ఎస్‌జీఎ్‌సటీలో జమచేసింది. అనంతరం సీజీఎ్‌సటీ రూ.70,501 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూ.71,587 కోట్లకు చేరుకున్నాయి. కాగా, గతనెల ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి చెంది రూ.3,545 కోట్లకు చేరుకోగా.. తెలంగాణలో ఆదా యం 14 శాతం వృద్ధితో రూ.4,753 కోట్లకు పెరిగాయి.

Leave a Comment